Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి జనార్థన్ రెడ్డి 'కుడి భుజం'కు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం

గాలి జనార్థన్ రెడ్డి. ఈ పేరు దేశంలో తెలియనివారుండరు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం. ఎందుకంటే.. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్‌గా చెలామణి అయిన గాలి జనార్థన్ రెడ్డి గత యూపీఏ ప్రభు

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:44 IST)
గాలి జనార్థన్ రెడ్డి. ఈ పేరు దేశంలో తెలియనివారుండరు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం. ఎందుకంటే.. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్‌గా చెలామణి అయిన గాలి జనార్థన్ రెడ్డి గత యూపీఏ ప్రభుత్వంలో అష్టకష్టాలు పడ్డారు. మైనింగ్ అక్రమ రవాణా కేసులో ఏకంగా రెండేళ్ళకు పైగా జైలుశిక్షను అనుభవించి, ప్రస్తుతం బెయిలుపై విడుదలై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుడి భుజంగా చెలామణి అయిన బళ్ళారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందింది. 
 
సాధారణంగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయతీగా వస్తోంది. ఇప్పుడు ట్రంప్ కూడా విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో విందును ఏర్పాటు చేశారు. 
 
ఈ విందుకు భారత్ నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కాగా, మరొకరు శ్రీరాములు. వీరిద్దరికీ ఇప్పటికే వైట్ హౌస్ నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని అనుభూతిగా ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments