Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రపతి గౌరవ వేతనం రూ.5లక్షలు.. ఐదేళ్లకు ఓసారి పెంచాల్సిందే..

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎంపీల వేతనాలు పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంచినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి

రాష్ట్రపతి గౌరవ వేతనం రూ.5లక్షలు.. ఐదేళ్లకు ఓసారి పెంచాల్సిందే..
, గురువారం, 1 ఫిబ్రవరి 2018 (12:43 IST)
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎంపీల వేతనాలు పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంచినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి గౌరవ వేతనం రూ.5లక్షలకు, ఉపరాష్ట్రపతి గౌరవ వేతనం రూ.4లక్షలు, గవర్నర్ల గౌరవ వేతనం రూ.3.5లక్షలుగా పెంచనున్నట్లు తెలిపారు. ఐదేళ్లకు ఓసారి వేతనాలను పెంచే దిశగా చట్టం తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. 
 
అలాగే ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్‌ ఐడీ వుంటుందని.. స్టాంప్‌ డ్యూటీల విధానం నుంచి బయట పడేందుకు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. భారత్‌ నెట్‌వర్క్‌ కార్యక్రమం కోసం రూ.10వేల కోట్లు కేటాయించామని, గ్రామాల్లో 5లక్షల వైఫై రూటర్ల సదుపాయం కల్పిస్తామని జైట్లీ తెలిపారు. 
 
టోల్‌ ప్లాజాలో సులభతర ప్రయాణానికి వీలుగా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు వుంటాయని, 3600 కి.మీ. మేర రైల్వేలైన్ల పునరుద్ధరణ. 600 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు. అన్ని రైల్వే జోన్‌లు, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సౌకర్యం ఏర్పాటు చేస్తామని చె్పపారు. చెన్నై పెరంబూర్‌లో అధునాతన కోచ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. 
 
రైల్వేల్లో 18 వేల కి.మీ. డబ్లింగ్‌. రైలు పట్టాల నిర్వహణకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. 4వేలకు పైగా కాపలాదారులు లేని గేట్లను తొలగిస్తామని ప్రకటించారు. ఇంటింటి తాగునీటి పథకానికి రూ.77,500కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నమామి గంగ పథకం కింద 187 ప్రాజెక్టులు, కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్‌ 8.33శాతం నుంచి 12శాతానికి పెంచినట్లు వెల్లడించారు.
 
పెంచిన ఈపీఎఫ్‌ మూడేళ్ల పాటు అమల్లో వుంటుందని.. గత మూడు సంవత్సరాల్లో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. పీఎం జీవన్‌ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని.. జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019 నాటికి మహిళా సంఘాలకు రూ.75వేలకోట్ల రుణాలు