Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధ మేఘాలు : ఉత్తర కొరియాపై దాడికి కదిలిన యుఎస్ వార్ షిప్?

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఉత్తర కొరియా ధిక్కార చర్యలను ఏమాత్రం సహించజాలని అగ్రరాజ్యం అమెరికా.. ఆ దేశంపై దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (10:09 IST)
అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఉత్తర కొరియా ధిక్కార చర్యలను ఏమాత్రం సహించజాలని అగ్రరాజ్యం అమెరికా.. ఆ దేశంపై దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంకేతాలను నిజం చేసేలా మిత్రదేశం దక్షిణ కొరియా సముద్ర ప్రాదేశిక సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకను అమెరికా తరలిస్తోంది. దీంతో అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
గత నెల 5వ తేదీన బాలిస్టిక్ అణు క్షిపణిని పరీక్షించడం, ఆపై అమెరికాను రెచ్చగొడుతూ దాడి చేస్తామని హెచ్చరించడం, తాజాగా ఉత్తర కొరియా వైపు దూసుకొస్తున్న యుద్ధనౌకలు... ఈ పరిణామాలు చూస్తుంటే, యుద్ధం అనివార్యమని అనిపిస్తున్నట్టు నిపుణులు వ్యాఖ్యానించారు.
 
ఉత్తర కొరియా అధ్యక్షుడు కింమ్ జాంగ్ ఉన్‌కు షాకిచ్చేలా యూఎస్ వార్‌షిప్‌లలో అత్యంత కీలకమైన యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్‌ను కూడా ఉత్తర కొరియా సముద్ర జలాల్లోకి అమెరికా పంపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఎస్ కార్ల్ విల్సన్ దక్షిణ కొరియాకు దగ్గరగా ఉండగా, ఇప్పుడు దానికి తోడుగా మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. ఈ రెండూ కలసి యుద్ధ విన్యాసాలు చేయనున్నాయని యూఎస్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments