Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో అంతుచిక్కని వైరస్.. ముగ్గురు చిన్నారుల బలి.. ట్రంప్‌కు కొత్త తలనొప్పి..!

Webdunia
శనివారం, 16 మే 2020 (18:56 IST)
MIS-C
అమెరికాలో ఇప్పటికో కరోనా విజృంభిస్తుంటే.. అగ్రరాజ్యానికి మరో తలనొప్పి వచ్చిపడింది. అంతుచిక్కని వ్యాధితో ఇద్దరు చిన్నారులు బలైయ్యారు. దీంతో అమెరికా తలపట్టుకుంది. అమెరికాలోని న్యూయార్క్‌తో పాటు 17 ప్రావిన్స్‌లలో కొత్త అంతుచిక్కని వ్యాధి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి గురించి న్యూయార్క్ ప్రావిన్స్ గవర్నర్ ఆండ్రూస్ క్యూమో మాట్లాడుతూ.. కరోనాతో పాటు కొత్త అంతుచిక్కుని వ్యాధి వ్యాపించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
 
ఈ అరుదైన వ్యాధి కారణంగా పరిస్థితి అదుపులో లేదని.. ఇది చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని.. మృతులను పెంచుతుందని చెప్పారు. మల్టీసిస్టమ్ ఇన్ఫ్లామేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (MIS-C) అనే పేరుతో ఈ వ్యాధి చిన్నారులను సోకుతుందని చెప్పారు. ఈ వ్యాధికి కరోనాకు సంబంధం వుందా లేదా అనే కోణంలో పరిశోధన జరుపుతున్నట్లు తెలిపారు. 
 
ఈ వ్యాధి కారణంగా 5, 7, 17 ఏళ్ల ముగ్గురు పిల్లలను బలిగొందని వెల్లడించారు. అంతేగాకుండా MIS-C వ్యాధి న్యూయార్కులో 110 మందికి సోకిందని చెప్పుకొచ్చారు. దీనిపై వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ వ్యాధి మరికొన్ని వారాల్లో మరింత సోకే అవకాశం వుందని.. మరో 16 ప్రావిన్స్‌లలో హెల్త్ మినిస్ట్రీ అధికారులు ఈ వైరస్‌ను పరిశీలిస్తున్నారని చెప్పారు. 
 
పిల్లలకు ఐదు రోజులకు పైగా జ్వరం వుంటే, ఆహారంలో తీసుకోవడంలో ఇబ్బంది వుంటే, పొత్తి కడుపులో నొప్పి వుంటే, డయేరియా వుంటే, వాంతులు, శ్వాస తీసుకోవడంలో వుంటే MIS-C వైరస్ వున్నట్టేనని.. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్ తెలిపారు. 
 
ఈ కొత్త వైరస్‌ ఇప్పటికే 100 మంది చిన్నారులను ఆవహించింది. వారిలో 55 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ కొత్త వైరస్ తొలుత గుండెను, మూత్రాశయాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్నారులకే ఈ వ్యాధి సులభంగా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments