Webdunia - Bharat's app for daily news and videos

Install App

42 ఏళ్ల మహిళ 22 ఏళ్ల యువకుడితో ఎఫైర్, అతడికి పెళ్లనేసరికి చంపేసింది...

Webdunia
శనివారం, 16 మే 2020 (16:49 IST)
ఆరు నెలల క్రితం భర్తతో గొడవ. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఐదేళ్ళ కుమార్తె ఉంది. అయితే భర్త లేకపోయేసరికి ఇళ్ళలో పనిచేసుకుని జీవనం సాగిస్తూ ఉండేది. ఈ క్రమంలో తన ఇంటి పక్కనే ఉన్న యువకుడితో సన్నిహితమైంది. మూడునెలల పాటు ఈ తంతు సాగింది. కానీ ఆ యువకుడికి పెళ్ళి నిశ్చయమైంది. యువకుడు తనకు దూరమైపోతాడేమోనన్న కోపంతో అతన్ని దారుణంగా హత్య చేసింది.
 
కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన బాలమ్మకు 42 సంవత్సరాలు. కొన్ని కారణాల వల్ల ఆమెను భర్త వదిలేశాడు. కుమార్తెతో ఉంటోంది. ఇళ్ళలో పనిచేస్తోంది. ఐతే తను వుండే ఇంటి పక్కనే 22 యేళ్ళ కుర్రాడు ఆమెతో చనువును పెంచుకున్నాడు. ఆమె కూడా అతడికి బాగా దగ్గరైంది. దీనితో ప్రతిరోజు ఇంట్లోనే ఆ తంతు జరిగేది.  
 
ఇంట్లో కుమార్తె తప్ప ఎవరూ లేకపోవడంతో ఆ యువకుడు ఇంటికి రాగానే పాపను ఆడుకోవడానికి పంపించి తన పని కానిచ్చేసేది. అయితే ఆ యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. లాక్ డౌన్ తరువాత వచ్చే నెల జూన్‌లో అతడి పెళ్ళి జరగాల్సి ఉంది.
 
విషయం కాస్తా బాలమ్మకు తెలిసింది. అతడిని నిలదీసింది. పెళ్ళే కదా. చేసుకుంటాను. కానీ నీతో మాత్రం కలిసే ఉంటానని చెప్పాడు. అయితే దానికామె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యా తరచూ గొడవ జరిగేది. నిన్న సాయంత్రం ఇదే విధంగా గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన బాలమ్మ తనకు దక్కని ఆ యువకుడు ఇంకెవరికీ దక్కకూడదని అతి దారుణంగా కత్తితో నరికి చంపేసింది.
 
రాత్రి అయిన తరువాత కుమార్తెను పడుకోబెట్టి పడుకునే చాపలో అతడి మృతదేహాన్ని చుట్టిపెట్టి ఆంధ్రాబ్యాంకు సమీపంలో కాలువలో పడేసి ఇంటికి వచ్చేసింది. అయితే స్థానికుల సమాచారంతో గుర్తు తెలియని మృతదేహాన్ని కనిపెట్టిన పోలీసులు విచారణ జరపగా ఫోన్ ఆధారంగా బాలమ్మ బాగోతం బయటపడింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments