టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజులు సమయం.. అంతలోపు..?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (18:50 IST)
ప్రస్తుత అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం చైనీస్ యాప్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. దీంతో డిసెంబర్ 4వ తేదీలోగా టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్ డ్యాన్స్‌కు సమయం దొరికింది. నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్ అమ్మకం ప్రక్రియను బైట్ డ్యాన్స్ పూర్తి చేయాలి. 
 
అమెరికన్ యూజర్ల డేటాను పూర్తిగా తొలగించాలి. అమెరికా జాతీయ భద్రతను బైట్ డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తోందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ తన గత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్ టాక్ యాప్ వ్యాల్యుయేషన్ 50 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నది. అమెరికాలో టిక్‌టాక్‌కు 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
 
కాగా టిక్ టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించాలని ట్రంప్ పాలనా వర్గం ఆగస్ట్‌లో ఆదేశించింది. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. తాజాగా 27వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పెంచింది. ఆగస్టులో 45 రోజుల పాటు గడువు ఇచ్చారు. ప్రస్తుతం దానిని 90 రోజులకు నవంబర్ 12వరకు పొడిగించారు. అనంతరం మరో 15 రోజులు పొడిగించి, నవంబర్ 27వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరో వారం పొడిగింపు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments