Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్... ఇప్పటికైనా అర్థం చేసుకో: పాకిస్తాన్‌కి షాకిచ్చిన ట్రంప్

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (16:40 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి షాకుల మీద షాకులిస్తున్నాయి అగ్ర రాజ్యాలు. ముఖ్యంగా కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పిన అమెరికా ఆ మాట ఊసెత్తడంలేదు. పైగా కశ్మీర్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోవడంలేదు. ఈ వ్యవహారం ఇమ్రాన్ ఖాన్ కు చిర్రెత్తికొస్తోంది. ఐతే అగ్రరాజ్యాలు అలా మొండికేయడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుని కూర్చున్నారు. 
 
ఇలా కూర్చున్న ఇమ్రాన్ కు మరో పిడుగులాంటి వార్త చేరింది. అది కాస్తా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్ట తయారైంది. అసలే కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజం మద్దతు లభించక మూలుగుతుంటే అగ్రరాజ్యం అమెరికా ఇచ్చిన కొత్త షాకుతో గింగరాలు తిరుగుతోంది పాకిస్తాన్. పాకిస్థాన్‌తో మెరుగైన భాగస్వామ్య ఒప్పందం 2010 కింద ఆ దేశానికి అందజేయాల్సి ఉన్న ఆర్థిక సాయంలో కోత పెట్టి గట్టి షాకిచ్చింది. 
 
పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టేందుకు ఇస్తున్న నిధులను వాటికి వినియోగించకపోగా తీవ్రవాదులను మరింత పెంచిపోషిస్తున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారట. మొత్తం 7.5 బిలియన్ డాలర్లు సాయం చేయాల్సి వుండగా అందులో సగానికి సగం కోత వేసి 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఐతే భవిష్యత్తులో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఎలాంటి చర్యలు తీసుకోనట్లయితే ఇంకా ఇవ్వాల్సిన నిధుల్లో మరింత కోత వేసే అవకాశం వున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. 
 
కరడుగట్టిన హక్కానీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను అడ్డుకుని, వారిని ఏరివేయడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ గత సంవత్సరంలోనే బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయాన్ని నిలిపివేసి షాకిచ్చింది. ఇప్పుడు మరోసారి పుండు మీద కారం జల్లినట్లు మళ్లీ ఆర్థిక సాయంలో కోత విధించడంతో ఇమ్రాన్ ఖాన్ అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments