'సాహో'కి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా... నిర్మాతలు ఆశ్చర్యపోయారట...

శనివారం, 17 ఆగస్టు 2019 (15:04 IST)
సాహో సినిమా గురించి ఎంత ప్రచారం జరుగుతుందో... ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న పారితోషికం గురించి అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలో ప్రభాస్ 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. 
 
సాహో మూవీని ప్రభాస్ సన్నిహితులు తీసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే భాగస్వామ్యులయ్యారు. భాగస్వామి అవడం వల్ల వారి పెట్టుబడి పోగా మిగిలిన మొత్తం షేర్ మొత్తం 100 కోట్లు ప్రభాస్‌కు మిగులుతుందట. అయితే ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుండడంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డార్లింగ్.
 
సాహో మూవీ ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. తన రెగ్యులర్ పారితోషికం నుంచి 25 శాతం నిర్మాతలకు ఇచ్చానని, సినిమా బడ్జెట్ ఎక్కువైన కారణంగా పారితోషికం వారికి భారం కాకూడదని నిర్ణయించుకుని చాలా తక్కువగా తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. ఐతే పారితోషికంలో 25 శాతం తిరిగి ఇవ్వడంతో నిర్మాతలు షాకయ్యారట. ప్రభాస్ నిర్ణయానికి వారు హ్యాట్సాప్ చెప్పారట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విజయ్‌తో ఆ సంబంధం లేదన్న రష్మిక.. ఎన్టీఆర్‌తో?