Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#SaahoTrailer రిలీజ్... చితక్కొట్టిన ప్రభాస్... (Video)

#SaahoTrailer రిలీజ్... చితక్కొట్టిన ప్రభాస్... (Video)
, శనివారం, 10 ఆగస్టు 2019 (17:26 IST)
సాహో ట్రెయిలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. ప్రభాస్ యాక్షన్ స్టంట్స్ చూస్తే ఓ రేంజిలో వున్నాయి. గ్యాంగస్టర్ల మధ్య వార్ సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సాహో ఆ స్థాయికి తగ్గట్లే వున్నట్లు ఈ ట్రెయిలర్ చూస్తే అర్థమవుతుంది. 
 
యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.
webdunia
 
బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్‌కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటితో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి మట్ట సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే?