Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక షట్‌డౌన్ ... అమెరికా వాసులకు జీతాల కష్టాలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (12:26 IST)
అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఫలితంగా పరిపాలన చుట్టుముట్టింది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవేశెట్టిన ఓ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడంతో ఈ పరిణామంచోటుచేసుకుంది. ఫలితంగా అమెరికాలో ఆర్థిక కల్లోలం కనిపిస్తోంది. 
 
ముఖ్యంగా, క్రిస్మస్ పండుగ రోజుల్లో అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ షట్‌డౌన్ వల్ల 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమందికి వేతనాలు లభించవు. మరికొందరు జీతం లేకుండానే పనిచేయాల్సి పరిస్థితి ఏర్పడింది. 
 
ట్రంప్ ప్రవేశపెట్టిన ఫెడరల్ వ్యయ బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించకుండానే వాయిదావేసింది. ఫలితంగా డిసెంబర్ 21వ తేదీ శుక్రవారం అర్థరాత్రి నుంచి పలు కీలక సంస్థల కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. మెక్సికో సరిహద్దులో భారీ గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీనివ్వడం... దానికి అవసరమైన నిధులు కేటాయించాలంటూ (రూ.35వేల కోట్లు) కాంగ్రెస్‌ను ట్రంప్ కోరగా, ఈ నిధులు మంజూరు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. 
 
ప్రభుత్వం కార్యకలాపాలు స్తంభించడంతో దాదాపు 8 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. వారిలో 4 లక్షల మంది ఉద్యోగులు వేతనాలు తీసుకోకుండా పనిచేయాల్సి వస్తే మరో 4 లక్షల మంది సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో నెలకొన్న ప్రభావం భారతదేశంపై ఉంటుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments