Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జి ఫ్లాయిడ్ హత్య కేసు : 270 నెలల జైలు శిక్ష

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (13:16 IST)
అమెరికాలో జరిగిన జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు గత యేడాది దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన మెడను ఓ పోలీస్ అధికారి కాలితో నొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ క్రమంలో జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మరణానికి కారణమైన అమెరికా పోలీసుల అధికారి డెరిక్ చౌవిన్‌ (45)కు అమెరికా కోర్టు 270 నెలల (ఇరవై రెండున్నర సంవత్సరాలు) జైలు శిక్ష విధించింది. డెరిక్‌ను ఇదివరకే దోషిగా నిర్ధారించిన కోర్టు గత రాత్రి అతడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. 
 
గతేడాది మే 25న జార్జి ఫ్లాయిడ్ మెడను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపట్టాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా డెరిక్ కనికరించలేదు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments