Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే.. వారంతా ఉగ్రవాదులే... భారత్‌ జాబితాకు అమెరికా మద్దతు

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:01 IST)
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అయిన కరుడుగట్టిన ఉగ్రవాదులైన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లక్వీ, మసూద్‌లను కొత్త ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్‌లను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం 1967 ప్రకారం వ్యక్తిగత ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. యూఏపీఏ చట్టానికి చేసిన కీలకమైన సవరణలను పార్లమెంట్ ఆమోదించిన నెల రోజుల్లోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
 
యూఏపీఏ చట్ట సవరణ ప్రకారం వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించొచ్చు. గతంలో ఏవైనా గ్రూపులు, సంస్థలను మాత్రమే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. ఇప్పుడు యూఏపీఏ చట్టానికి సవరణలు చేయడంతో వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అవకాశం దక్కింది. 
 
మౌలానా మసూద్ అజర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని, కాబట్టి అతడిని ఈ చట్టం కింద ఉగ్రవాదిగా పేర్కొన్నట్టు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, హఫీజ్ ముహమ్మద్ సయీద్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని, అందుకే అతడిని కూడా ఈ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించినట్టు కేంద్రం వివరించింది. 
 
మరోవైపు, కొత్త యూఏపీఏ చ‌ట్టం ప్ర‌కారం మ‌సూద్ అజ‌ర్‌, హ‌ఫీజ్ స‌యీద్‌, దావూద్ ఇబ్ర‌హీం, జ‌కీర్ ఉర్ ర‌హ్మాన్ ల‌ఖ్వీల‌ను ఉగ్ర‌వాదులుగా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భార‌త ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌ను అమెరికా స్వాగ‌తించింది. భార‌త నిర్ణ‌యాన్ని మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు యాక్టింగ్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ఫ‌ర్ సౌత్ అండ్ సెంట్ర‌ల్ ఆసియా అధిప‌తి అలిస్ వెల్స్ ట్వీట్ చేశారు. భార‌త్ చేసిన ప్ర‌క‌ట‌న ఉగ్ర‌వాద నిర్మూల‌న కోసం అమెరికా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌కరిస్తుంద‌ని అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments