Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేం : చిదంబరానికి సుప్రీం షాక్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:27 IST)
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ త‌న‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున‌ద‌ని, త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబ‌రం పిటిష‌న్ పెట్టుకున్నారు. 
 
కేసు ద‌ర్యాప్తు ఆరంభ‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు బెయిల్ ఇవ్వ‌డం వ‌ల్ల ఆ కేసు విచార‌ణ మంద‌గిస్తుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఆర్థిక నేరాలు భిన్న‌మైన‌వ‌ని, వాటిని ద‌ర్యాప్తు చేసేందుకు ప‌ద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయ‌ని కోర్టు స్పష్టం చేసింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రం మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఇప్ప‌టికే చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆగ‌స్టు 21న రాత్రి హై డ్రామా మ‌ధ్య చిదంబ‌రాన్ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ఇప్పటికే చిదంబరం వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments