Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కటంటే ఒక్కటే.. పామును ఇలా పట్టుకున్నారు (వీడియో)

ఓ పాము కోసం పెద్ద హంగామా చేసేశారు. పామును పట్టుకునేందుకు పెరటి మొత్తాన్ని తవ్వేశారు. ఇదేంటి పాము కోసం పెరటినే తవ్వేశారా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. సాధారణమైన పామంటే.. పెద్దగా ప

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (18:10 IST)
ఓ పాము కోసం పెద్ద హంగామా చేసేశారు. పామును పట్టుకునేందుకు పెరటి మొత్తాన్ని తవ్వేశారు. ఇదేంటి పాము కోసం పెరటినే తవ్వేశారా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. సాధారణమైన పామంటే.. పెద్దగా పట్టించుకునేవారు కాదట. కానీ ఆ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో రెండో జాతికి చెందిందట. 
 
అందుకే దాని కోసం ఇంటి వెనుక వున్న పెరడును తవ్వించేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో చోటుచేసుకుంది. క్వీన్స్‌లాండ్‌లో వున్న హెలెన్స్‌వాలేలోని ఓ ఇంటి పెరట్లో ఉన్న కాంక్రీటు స్లాబ్‌లో ప్రమాదకరమైన పాము ఆరు నెలల నుంచి దాక్కుని వుందట. దాన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయట. 
 
ఇక లాభం లేదనుకున్న ఆ ఇంటి యజమాని.. సహాయక సిబ్బందిని రంగంలోకి దించారట. ఇక అటవీ శాఖాధికారులు ఆ పాము కోసం పెరటినంతా తవ్వేశారు. అయినా చిక్కలేదు. చివరకు కాంక్రీట్ స్లాబును పగులకొట్టి.. పామును పట్టుకున్నారు. ఆపై దానిని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఆ పాము పేరు బ్రౌన్ స్నేక్ అని అటవీశాఖాధికారులు తెలిపారు. పామును పట్టుకునేందుకు సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments