Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ప్రయాణం ఇకపై ఓ కల... యూఎస్ వీసా గగనమే....

ఇకపై అమెరికా ప్రయాణం ఓ కలగానే మిగిలిపోనుంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన వలస విధానంలో ఆ దేశ వైఖరి పూర్తిగా మారిపోయింది. దేశంలోకి వచ్చిన వారిని బయటకు పంపడం కన్నా... అసలు దేశంలోకే ఎవరుపడ

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (09:41 IST)
ఇకపై అమెరికా ప్రయాణం ఓ కలగానే మిగిలిపోనుంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన వలస విధానంలో ఆ దేశ వైఖరి పూర్తిగా మారిపోయింది. దేశంలోకి వచ్చిన వారిని బయటకు పంపడం కన్నా... అసలు దేశంలోకే ఎవరుపడితే వారు రావడాన్ని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. 
 
ఫలితం.. భారతలోని అమెరికా రాయబార కార్యాలయాలు గతంలోలాగా ఎక్కువ వీసాలు జారీ చేయడం లేదు. గతేడాది మొత్తం 1.65 లక్షల వీసాలు జారీ చేసిన ఇక్కడి ఎంబసీలు ఈ ఏడాది 40 వేలకు మించి జారీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఈ యేడాది వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి నిరాశే మిగులుతోంది. ఈ ఏడాది ఇప్పటికి కేవలం 8-9వేల వీసాలే జారీ చేయడంతో ఇకపై అమెరికా వీసాలు అంత సులభం కాదని స్పష్టమవుతోంది. 
 
హెచ్‌1బీ వీసా మంజూరు చేయాల్సిన అమెరికాలోని కంపెనీలు కూడా ఇప్పుడు వెనుకంజ వేస్తున్నట్లు అమెరికాలోని భారత ఎన్నారైలతో పాటు పలు కన్సల్టెన్సీల నిర్వహకులు తెలిపారు. చాలా కంపెనీలు అసలు హెచ్‌1బీ వీసాలు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని వివరించారు. అన్ని అర్హతలున్నా.. కొందరు ఉద్యోగుల వీసా జారీ ప్రక్రియను మూడు నెలలు పెండింగ్‌లో పెట్టినట్లు ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు తెలిపారు. 

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments