Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్‌డొనాల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ లాగించిన తల్లీకూతుళ్లు.. మధ్యలో బల్లి డీప్ ఫ్రై.. కనిపించేసరికి?

అమెరికాలోని కాలిఫోర్నియా కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్క ఎలుక ఆకారంలో ఉండటం.. అచ్చం ఎలుక మాదిరి ఉన్న సదరు ఫోటో సోషల్ మీడియాలోనే కాదు.. పలుదేశాల్లో సంచలనం సృష్టించింది.

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (09:24 IST)
అమెరికాలోని కాలిఫోర్నియా కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్క ఎలుక ఆకారంలో ఉండటం.. అచ్చం ఎలుక మాదిరి ఉన్న సదరు ఫోటో సోషల్ మీడియాలోనే కాదు.. పలుదేశాల్లో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా కేఎఫ్సీ కిందామీదా పడింది. అసలీ వ్యవహారానికి కారణమైన కస్టర్ డిక్సన్ను కలిసేందుకు కేఎఫ్సీ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా అతని లాయర్ ఆ మాంసం ముక్కను ఓ ల్యాబ్కు అందించారు. అయితే.. సదరు ల్యాబ్ వారి నివేదిక ప్రకారం.. అది ఎలుక మాంసం కాదని.. చికెన్ ముక్కేనని తేల్చారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. 
 
కానీ భారత్‌లో తాజాగా మెక్‌డొనాల్డ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు చిక్కొచ్చిపడింది. కోల్‌కతాలో నివసించే ప్రియాంక అనే మహిళ తన కుమార్తెను వెంటబెట్టుకుని ఫాస్ట్‌పుడ్‌ తినడానికి మెక్‌డొనాల్డ్‌ ఔట్‌లెట్‌కు వెళ్లింది. అక్కడ ఫ్రెంచ్ ఫ్రై ఆర్డరిచ్చి.. వచ్చాక హ్యాపీగా లాగించేశారు. అయితే ఇద్దరు తింటుండగా.. ప్రియాంక కుమార్తె.. ఆహారంలో బాగా ఫ్రై అయిపోయిన బల్లిని గుర్తించింది.
 
గర్భవతి అయిన ప్రియాంక.. ఆ బల్లిని చూడగానే వాంతులు చేసుకున్నారు. మేనేజర్‌కు చెబితే ఆయన సింపుల్‌గా సారీ చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రియాంక.. బల్లిని ఫోటో తీసి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు కూడా మెక్‌డొనాల్డ్‌ సంస్థపై కేసు నమోదుచేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం