Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

ఠాగూర్
బుధవారం, 7 మే 2025 (11:54 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే సైనిక సంఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్యకు దిగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ రెండు దేశాల మధ్య జరిగే సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ చేపట్టిన సైనిక చర్యల పట్ల సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని డుజారిక్ మంగళవారం వెల్లడించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది.
 
మరోవైపు, భారత రక్షణ మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడులు చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. "క్రూరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఖచ్చితమైన, నియంత్రిత దాడులు జరిగాయి" అని పేర్కొంది. అంతకుముందు, భారత సైన్యం కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "న్యాయం జరిగింది. జై హింద్" అని భారత సైన్యం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments