Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎన్ టెర్రర్ లిస్ట్: 139 పాకిస్థానీయులకు చోటు.. దావూద్‌కు?

ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతామండలి ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో డాన్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా వుంది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు, ఉగ్రమూకల జాబితాను ఐరాస

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (17:57 IST)
ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతామండలి ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో డాన్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా వుంది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు, ఉగ్రమూకల జాబితాను ఐరాస విడుదల చేసింది. ఇందులో దావూద్‌తో పాటు ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్, అల్ జవహరి పేర్లు కూడా వున్నాయి. ఇంకా ఈ జాబితాలో 139 పేర్లు పాకిస్థాన్‌కు చెందినవే కావడం గమనార్హం. 
 
ఇందులో భాగంగా రావల్పిండి, కరాచీల నుంచి పలు పాకిస్థానీ పాస్ పోర్టులను దావూద్ పొందాడని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన నివేదికలో తెలిపింది. అలాగే కరాచీలోని నూరాబాద్ కొండ ప్రాంతంలో దావూద్‌కు ఓ విలాసవంతమైన భవనం వుందని పేర్కొంది. 
 
ఇంకా ప్రపంచ దేశాల్లో అతనికి ఆస్తులు వున్నాయని వెల్లడించింది. భద్రతామండలి ఉగ్రసంస్థల జాబితాలో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, తాలిబాన్ పాకిస్థాన్ వంటి తదితర సంస్థలు చోటు దక్కించుకున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments