Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించనున్న యూకే ప్రభుత్వం

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (21:33 IST)
యూకే ప్రభుత్వం 2030 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లపై పూర్తిగా నిషేధం విధించనుంది. దీనికి సంబంధించిన ప్రకటనను యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే వారం చేయనున్నారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు యూకే ప్రభుత్వం 2040 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించాలని మొదట అనుకుంది. అయితే దీన్ని ఐదేళ్లు ముందుకు జరుపుతూ 2035 నుంచి వీటిపై నిషేధం విధించనున్నట్టు బోరిస్ జాన్సన్ ఫిబ్రవరిలో ప్రకటించారు.
 
ఇక ఇప్పుడు ఈ నిషేధ నిర్ణయాన్ని మరో ఐదేళ్లు ముందుకు జరుపుతూ 2030 నుంచే పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించడానికి బోరిస్ జాన్సన్ పూనుకున్నారు. 
 
పర్యావరణ విధానంపై వచ్చే వారం బోరిస్ జాన్సన్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలోనే ఆయన ఈ నిషేధానికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు. మరోపక్క ఎలక్ట్రిక్, ఖనిజ ఇంధనాలతో కలిసి తయారయ్యే హైబ్రిడ్ కార్లకు మాత్రం 2035 వరకు మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
 
ఈ ఏడాది యూకేలో పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాల మార్కెట్ షేర్ 73.6 శాతంగా నమోదైంది. ప్యూర్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ షేర్ కేవలం 5.5 శాతంగానే ఉంది. కాగా.. ప్రపంచదే శాలన్ని ప్రస్తుతం పర్యావరణంపై దృష్టి సారించాయి. పొల్యూషన్‌ను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. రానున్న పదేళ్లలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments