Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో పాటు 12 దేశాలపై విజిటింగ్ వీసాలను రద్దు

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (18:25 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అరబ్ దేశం కొత్త నిర్ణయం తీసుకుంది. పలు దేశాల పౌరులకు జారీ చేసిన విజిటింగ్ వీసాలను రద్దు చేస్తున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పష్టం చేసింది. కొత్త వీసాల జారీని సైతం నిలిపివేయనున్నామని అధికారులు స్పష్టం చేశారు. 
 
పాకిస్థాన్ సహా మొత్తం 12 దేశాల ప్రజలపై ఈ తాత్కాలిక నిషేధం అమలవుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధురి వెల్లడించారు. సోమాలియా, లిబియా, కెన్యా, ఆఫ్గనిస్థాన్, టర్కీ, ఇరాన్, యమన్, సిరియా, ఇరాక్ దేశాల వాసులకు జారీ చేసిన వీసాలపైనా నిషేధం అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
 
గడిచిన వారం రోజులుగా పాకిస్థాన్‌లో రోజుకు 2 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన దేశాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కాగా, యూఏఈ నుంచి పాకిస్థాన్‌కు గత జూన్ నుంచి ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే. తాజాగా 12 దేశాలపై విజిటింగ్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అరబ్ అధికారులు తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments