Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుడి పొరపాటు.. అనస్థీషియా ఎఫెక్ట్.. గుండె ఆగిపోయి.. కోమాలోకి ..?

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (07:26 IST)
వైద్యుల పొరపాటు కారణంగా ప్రాణాల మీదకు తెచ్చిన ఘటనలు వున్నాయి. తాజాగా వైద్యుడి పొరపాటు కారణంగా మహిళ కోమాలోకి వెళ్లడంతో రూ. 2.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ అబుదాబీ కోర్టు తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. భార్యకు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం భర్త ఆమెను అబూధాబీలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నార్మల్ డెలివరీ కుదరకపోవడంతో వైద్యులు మహిళకు అనస్తీషియా ఇచ్చి సిజేరియన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ ముగిసే సరికి మహిళ గుండె ఆగిపోయి వెంటనే కోమాలోకి వెళ్లిపోయింది. రోజుల పాటు ఐసీయూలోనే చికిత్స పొందుతూ వచ్చింది.
 
doctor
వైద్యుల పొరపాటు కారణంగానే తన భార్య కోమాలోకి వెళ్లిందంటూ భర్త కోర్టుకెక్కడంతో కోర్టు వైద్యులదే పొరపాటు అని తీర్పునిచ్చింది. వైద్యుడు మహిళకు ఎక్కువ అనస్థీషియా ఇవ్వడం వల్లే ఆమె కోమాలోకి వెళ్లినట్టు కోర్టు నిర్థారించింది. దీనికి బాధ్యత వహిస్తూ బాధితులకు వైద్యుడు, ఆస్పత్రి యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. అయితే కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆస్పత్రి యాజమాన్యం పైకోర్టుకు వెళ్లింది. కానీ కింద కోర్టు తీర్పునే పైకోర్టు కూడా సమర్థించింది.
 
బాధితులకు ఆస్పత్రి యాజమాన్యం, తప్పు చేసిన వైద్యుడు 13 లక్షల దిర్హామ్‌ల(రూ. 2.58 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. కాగా.. బాధిత మహిళ ఇప్పుడు ఎలా ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments