Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 -15 నిమిషాలు ఉండివుంటే నన్నూ చంపేసేవారే!... టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్

టర్కీ తిరుగుబాటు చేదు జ్ఞాపకాలను ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ సారి నెమరు వేసుకుంటున్నారు. తాను అప్రమత్తంగా లేకుండా ఉండివుంటే నన్నూ చంపేసేవారే అని ఆయన వ్యాఖ్యానించారు.

Webdunia
బుధవారం, 20 జులై 2016 (15:35 IST)
టర్కీ తిరుగుబాటు చేదు జ్ఞాపకాలను ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ సారి నెమరు వేసుకుంటున్నారు. తాను అప్రమత్తంగా లేకుండా ఉండివుంటే నన్నూ చంపేసేవారే అని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో తిరుగుబాటు చేసిన సైనికులకు ఉరిశిక్ష విధించే అంశాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
ఇటీవల టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయగా, దీన్ని ఆదేశ ప్రజలు ఉక్కుపాదంతో అణిచివేసిన విషయం తెల్సిందే. అయితే, తిరుగుబాటు చేదు జ్ఞాపకాలు మాత్రం ఆ దేశ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు జరిగిన తిరుగుబాటుతో అతలాకుతలమైన ఆ దేశం ఇప్పుడిప్పుడే ఓ దారిన పడుతోంది. ఈ క్రమంలో మరో తిరుగుబాబు ఎదురైతే ఎలాగన్న భయమే జనాన్ని స్వచ్ఛందంగా రోడ్డపైకి వచ్చేలా చేసింది. 
 
ఈ తిరుగుబాటుపై అధ్యక్షుడు ఎర్డోగాన్ స్పందిస్తూ.. తిరుగుబాబు సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవం భయానకమైనదన్నారు. ‘‘తిరుగుబాటు జరిగిన రాత్రి నేను విశ్రాంతి తీసుకుంటున్న మర్మరీస్ పట్టణాన్ని తిరుగుబాటు దారులు ముట్టడించారు. ఇంకో 10, 15 నిమిషాలు నేను అక్కడే ఉన్నట్లైతే... నన్నూ చంపేసేవారు. లేదా బందీగా పట్టుకుని ఉండేవారు’’ అని ఆయన అని మీడియాకు వివరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments