Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో నిశ్చితార్థం.. బెంగుళూరులో ఆత్మహత్య... 8వ అంతస్తు నుంచి దూకి టెక్కీ సూసైడ్!

బెంగుళూరులోని ఓ ఐటీ పార్కులో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలో ఆ టెక్కీ ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Webdunia
బుధవారం, 20 జులై 2016 (15:24 IST)
బెంగుళూరులోని ఓ ఐటీ పార్కులో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలో ఆ టెక్కీ ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాను పని చేసే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన గుల్షాన్ చోప్రా అనే టెక్కీ బెంగళూరులో ఐటీ సెజ్‌లోని జెన్‌పాక్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఎప్పటిలాగే విధులకు వెళ్లిన గుల్షాన్ 8వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం నైట్ షిప్ట్‌కు వెళ్లిన గుల్షాన్ రాత్రి 11.20 సమయంలో 8వ అంతస్థుపైకి బాత్రూమ్‌కని వెళ్లి కిటికీలో నుంచి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
గుల్షాన్ ఆత్మహత్యకు వృత్తిపరమైన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. తన కొడుకు ఆత్మహత్యకు కొత్తగా వచ్చిన రాహులే కారణమని గుల్షాన్ తండ్రి ఆరోపిస్తున్నాడు. కావాలంటే తన కొడుకుకి, రాహుల్‌కు మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలను పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టత వస్తుందని సూచించాడు. 
 
ఇదిలావుంటే, పంజాబ్‌లోని యువతితో కొద్దిరోజుల క్రితమే గుల్షాన్‌కు నిశ్చితార్థమైంది. ఇతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆయన తండ్రి మాత్రం గుల్షాన్ ఆత్మహత్యకు వృత్తిపరమైన ఒత్తిడే కారణమని అంటున్నారు. కావాలంటే తన కొడుకుకి, రాహుల్‌కు మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని అంటున్నాడు.

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments