Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుటాకులా వణికిన టర్కీ - రెండు వరుస భూకంపాలు - 100 మందికిపైగా మృతి

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (11:00 IST)
దక్షిణ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు వచ్చాయి. దీంతో దక్షిణ టర్కీ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భూకంప తీవ్ర ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భవనాల శిథిలాల చిక్కుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ భూకంపం వల్ల దాదాపు వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
భూకంప లేఖినిపై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం తర్వాత హృదయ విదాకర పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి హాహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దయనీయంగా ఉన్నాయి. 
 
ఈ భూకంప ప్రభావం సిరియా, యెమెన్ తదితర సరిహద్దు దేశాల్లో కూడా కనిపించాయి. ఉత్తర సిరియాలోని పలు భవనాలు కూలినట్టు సమాచారం. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో తొలుత భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని సెకన్లకే 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు తెలిపింది. 
 
గజియాంటెప్ ప్రావిన్స్‌‍లోని నుదర్గికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూమికి 17.9 కిలోమీటర్ల లోతున తొలి భూకంపం సంభవించినట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే సెంట్రల్ టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతున రెండో భూకంపం సంభవించినట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments