Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న 11 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయిని రక్షించడానికి ప్రజలంతా మిలాప్‌లో ఏకం

cash
, గురువారం, 19 జనవరి 2023 (22:25 IST)
ఈ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన, దీపావళి పండుగ సమయంలో, శ్రీ లింగేష్ తన కూతురు సాత్వికను బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళవలసి వచ్చింది. పండుగ ఆనందాలలో మునిగి ఉన్న 11 ఏళ్ల బాలిక దుస్తులకు మంటలు అంటుకోవడంతో 40% పైగా కాలిన గాయాలయ్యాయి. ఆమె తల్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే ఆ బాలిక కడుపు, నడుము వరకు కాలిపోయింది. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత, కుటుంబ సభ్యులకు ఆమె కోలుకుంటుందని తెలిపారు అయితే కొన్ని అత్యవసర విధానాలు నిర్వహించాల్సి ఉండి దీనికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు.
 
శ్రీ. లింగేష్ నెలకు రూ.25 వేలు సంపాదించే ఒక ప్రైవేటు ఉద్యోగి. అతను ఈ దురదృష్టకర ప్రమాదానికి ఏవిధంగా కూడా తయారుగా లేడు. తన కుమార్తె కోలుకోవడానికి అంత డబ్బు లేక నిరాశపడి చికిత్స కోసం ఇంటర్నెట్‌లో సహాయం కోరుతూ క్రౌడ్‌ఫండింగ్‌‌లో ప్రయత్నిచాలని నిర్ణయించుకున్నాడు. అతను నిశ్శుల్క క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మిలాప్‌లో నిధుల సమీకరణను ప్రారంభించగా అతను ఆశ్చర్యడేలా 1200 మందికి పైగా దాతలు కొన్ని వారాల్లో దాదాపు రూ.11.5 లక్షలను సమకూర్చారు. సాత్విక ఇప్పుడు బాగానే ఉంది. ప్రస్తుతం మందులు చికిత్సలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంది. ఆమె రెగ్యులర్ చెకప్‌ల కోసం ప్రతి 7-10 రోజులకు ఒకసారి ఆసుపత్రికి వెళ్లాలి ఆమె బాగా కోలుకొంటోంది. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి చేతులు కలిపిన ప్రజలకు ఆమె కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.
 
ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ అనేది భారతదేశం అంతటా వైద్య ఎమర్జెన్సీలు, ఇతర సామాజిక అవసరాల కోసం సహాయాన్ని పొందడానికి నమ్మదగిన మార్గంగా మారింది. భారతదేశంలోని అతిపెద్ద క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మిలాప్‌లో గమనించినట్లుగా, అత్యవసర సమయాల్లో హైదరాబాద్ ప్రజలు క్రౌడ్ ఫండింగ్‌ను ప్రత్యామ్నాయ మరియు విశ్వసనీయమైన నిధుల కోసం ఆశ్రయిస్తారు. ప్లాట్‌ఫారమ్‌లో తెలిపే అవసరాలతో కనెక్ట్ అయ్యి, వారి శక్తికొద్ది  విరాళాలతో వారికి సహాయం చేసే భారీ దాతలు కూడా ఉన్నారు. మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన దంపతులకు  ఇటీవలే నెలలు నిండకుండానే కవల పిల్లలు పుట్టడం వల్ల తమ బిడ్డలను ఎన్‌ఐసీయూలో చేర్చవలసి వచ్చింది. పిల్లలు చాలా తక్కువ  నెలలలో (26+4 వారాలు) తక్కువ బరువుతో జన్మించడం వలన ఇంటెన్సివ్ వైద్య సహాయం కావలసి వచ్చింది. ఎన్‌ఐసీయూలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక , కుటుంబానికి అత్యవసరంగా డబ్బు అవసరమైనది.  వారు భారతదేశంలో అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మిలాప్‌లో నిధుల సమీకరణను ఏర్పాటు చేశారు. దాని తరువాత వారాల వ్యవధిలో భారతదేశం మరియు విదేశాల నుండి 240+దాతల నుండి రూ.4 లక్షల కంటే ఎక్కువ ధన సేకరణ జరిగింది. చికిత్స ప్రక్రియలు ప్రణాళికాబద్ధంగా జరిగాయి. ఇప్పుడు ఒక శిశువు ఎన్‌ఐసీయూ నుండి బయటపడింది ఇంకొకటి బాగా కోలుకొంటోంది.
 
హైదరాబాద్‌లో వైద్యపరమైన అవసరాలతోపాటు, విద్యాపరమైన అవసరాల కోసం కూడా ఆన్‌లైన్‌లో నిధుల సేకరణ ప్రజాదరణ పొందుతోంది. విద్యాపరమైన అవసరాల కోసం గత రెండేళ్లలో మిలాప్‌లో హైదరాబాద్ నుండి 17000 కంటే ఎక్కువ నిధుల సేకరణలు ఏర్పాటు చేయబడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన లాభాపేక్షలేని స్టార్టప్ అయిన ఈస్థర్ ఫౌండేషన్, భారతదేశంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతీ యువకులకు మిలాప్‌పై రూ. 15 లక్షల కంటే ఎక్కువ నిధులు సమీకరించింది. సేకరించిన నిధులతో, ఈస్థర్ ఇప్పటివరకు 2021లో 40+ మహిళలతో 3 ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను మరియు 2022లో అట్టడుగు వర్గాలకు చెందిన 100+ మహిళలతో ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. ఈ బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు టిసిఎస్, విప్రో, అక్సెంచూర్ వంటి అగ్రశ్రేణి కంపెనీలలో ఉద్యోగాలను పొందడానికి వారు నేర్చుకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకోగలిగారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అట్టహాసంగా అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ నిశ్చితార్థం