చైనాలో కరోనా విజృంభిస్తోంది. దేశ జనాభాలో 64 శాతం మందికి కరోనా వైరస్ సోకింది. ఈ నెల 11 నాటికి 90 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారని పెకింగ్ వర్శిటీ వెల్లడించింది.
గాన్సూ ప్రావిన్స్‌లో 91 శాతం మందికి కోవిడ్ సోకిందని వెల్లడించింది. యునాన్ ప్రావిన్స్‌లో 84 శాతం మంది, కింఘాయ్ ప్రావిన్స్‌లో 80 శాతం మంది వైరస్ బారిన పడ్డారు.
ఈ నెల 23న చైనా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో వున్న లక్షలాది మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు భారీ పెరిగే ఛాన్సుంది.