Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ నిర్ణయాలు భారత్ కొంప ముంచడం ఖాయం: చైనా హెచ్చరిక

భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువస్తున్న డిక్రీలు, అమలు చేస్తున్న విదానాలు భారత్ పుట్టి ముంచనున్నాయని చైనా తీవ్రంగా హెచ్చరించింది. ప్రధానంగా స్థానికులకు ఉద్యోగాలివ్వాలంటూ అమెరికా అ

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (03:27 IST)
భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువస్తున్న డిక్రీలు, అమలు చేస్తున్న విదానాలు భారత్ పుట్టి ముంచనున్నాయని చైనా తీవ్రంగా హెచ్చరించింది. ప్రధానంగా స్థానికులకు ఉద్యోగాలివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెస్తున్న విధానాలు.. భారత ప్రధాని మోదీ ఘనంగా ప్రస్తావిస్తున్న ‘మేకిన్  ఇండియా’ కార్యక్రమానికి సవాలేనని చైనా మీడియా హెచ్చరించింది. అయితే, ఆసియా మిత్రులతో అమెరికా సాగిస్తున్న సత్సంబంధాలు భారత్‌–అమెరికా మైత్రి ని బలోపేతం చేస్తాయని చైనా మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది.
 
‘చదువుకున్న, ఐటీ శిక్షణ పొందిన యువకులు ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. అమెరికా కంపెనీలకు వారే కీలకం. అందువల్ల అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ ట్రంప్‌ తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు (హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు) ఇప్పటికే అక్కడున్న భారత ఐటీ ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అమెరికాకు ఔట్‌సోర్సింగ్‌ చేస్తున్న భారత ఐటీ, ఫార్మా కంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదిస్తున్న మేకిన్  ఇండియా నినాదానికి ఇది తీవ్రంగా ఇబ్బందికరమే’ అంటూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments