భారత్ ఎటు వెళ్తోందో ఎవరికీ తెలీదు.. మోదీకి అస్సలు తెలీదు..ట
పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో భారతదేశం ఎటు పోతోందో ఎవరకీ తెలీదని, ప్రధాని నరేంద్రమోదీకి అస్సలు తెలియదని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త స్టీవ్ హెచ్. హాంకీ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దు చేతగానితనమేనని తాజాగా ప్రఖ్యాత అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హె
పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో భారతదేశం ఎటు పోతోందో ఎవరకీ తెలీదని, ప్రధాని నరేంద్రమోదీకి అస్సలు తెలియదని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త స్టీవ్ హెచ్. హాంకీ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దు చేతగానితనమేనని తాజాగా ప్రఖ్యాత అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హెచ్ హాంకీ విమర్శించారు. డీమోనిటైజేషన్ ప్రక్రియ తొలి నుంచీ గందరగోళంగానే సాగిందని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
మోదీ ప్రకటించిన డీమోనిటైజేషన్‌ను అమలు చేసేంతగా భారత్‌లో మౌలికసదుపాయాలు లేవని ఆయన తెలిపారు. ఈ విషయం మోదీ గుర్తెరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. నల్లధనంపై పోరు పేరుతో రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్ ప్రభావంతో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిపై అరశాతం దాకా ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ విమర్శలు కొనసాగుతూనే ఉండటం గమనార్హం. అవినీతిని కడిగిపారేసేందుకే పెద్ద నోట్ల రద్దు చేశామంటూ గప్పాలు కొడుతున్న ప్రధాని నరేంద్రమోదీకి పెద్దనోట్ల రద్దు పర్యవసానాల గురించే ఓనమాలు తెలీవు అన్నంత రేంజిలో అమెరికన్ ఆర్థికవేత్తలు వరుసగా ఎద్దేవా చేస్తుండటం సోషల్ మీడియోలో వాదప్రతివాదాలను తారాస్థాయికి తీసుకుపోతోంది.