Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్ భారతీయుల పిల్లల పౌరసత్వంపై ట్రంప్ బాంబ్, చట్టంగా మారితే అంతేసంగతులు

ఐవీఆర్
గురువారం, 7 నవంబరు 2024 (12:20 IST)
అలా అమెరికా పీఠంపై కాలుపెట్టబోతున్నాడో లేదో... అంతకంటే ముందుగానే అమెరికన్ భారతీయుల పిల్లల పౌరసత్వంపై డొనాల్డ్ ట్రంప్ భారీ నిర్ణయం తీసుకుంటున్నారు. అది కనుక చట్టం రూపం దాలిస్తే అమెరికాలో పుట్టిన లక్షల మంది పిల్లలు అమెరికన్ పౌరులు కాకుండా పోతారనే ఆందోళన మొదలైంది. కొత్తగా తీసుకువస్తున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం, అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు ఆటోమెటిక్ అమెరికా పౌరులుగా మారాలంటే తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి వుండాలి. అలా కాని పక్షంలో ఆ బిడ్డ అమెరికా పౌరుడు అయ్యే అర్హత వుండదు. ఇప్పుడిదే అమెరికాలో వుంటున్న భారతీయులకు ఉలికిపాటుకి గురిచేస్తోంది.
 
తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపుగా 48 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు వున్నారు. వారిలో 34 శాతం మంది అంటే... 16 లక్షల మంది అమెరికాలోనే జన్మించారు. అందువల్ల వారికి జన్మతహా అమెరికా పౌరసత్వం లభించింది. కానీ కొత్త చట్టం రూపుదాలిస్తే... నిబంధనల ప్రకారం అక్కడ పుట్టిన పిల్లలు అనర్హులయ్యే అవకాశం వుంది. ఐతే కోర్టులో ట్రంప్ చట్టం నిలబడదని మరికొందరు వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments