Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శలతో వెనక్కి తగ్గారు- తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేయం.. ట్రంప్

మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా వస్తున్న ప్రజలను అదుపుచేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా, వలసదారుల పిల్లల్ని వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్న అంశంపై అమెరికాలో ప్రస

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (10:46 IST)
మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా వస్తున్న ప్రజలను అదుపుచేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా, వలసదారుల పిల్లల్ని వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్న అంశంపై అమెరికాలో ప్రస్తుతం చర్చ సాగుతోంది.


ఇలా తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు ఏడుస్తున్న దృశ్యాలు, వారిని ఖైదీల తరహాలో బోనుల్లో నిర్బంధించిన వీడియోలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై యావత్తు ప్రపంచం మండిపడింది. ఇంకా ట్రంప్ సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌ కూడా మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేసే విధానానికి స్వస్తి పలుకుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసిన ఆయన, వలసదారులపై తమ కఠిన వైఖరిని మాత్రం మార్చుకోబోమని, అక్రమంగా సరిహద్దులు దాడి వచ్చే కుటుంబాలను కలిపి ఉంచే ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. 
 
అమెరికా సరిహద్దులు ప్రస్తుతం చాలా గట్టిగా ఉన్నాయని, కుటుంబాలను కలిపి ఉంచే విచారణ చేపట్టాలని నిర్ణయించామని ట్రంప్ వెల్లడించారు.  ముఖ్యంగా తమ తల్లిదండ్రులకు దూరమైన పిల్లల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments