Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్1బీ వీసా విధానానికి మంగళం! ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం!

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (09:35 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు గత కొన్నాళ్లుగా హెచ్‌-1బీ  వీసాల జారీలో పలు కఠిన నిబంధనలు తీసుకొస్తున్న డొనాల్డ్‌  ట్రంప్‌ ప్రభుత్వం ఆదిశగా మరో ప్రతిపాదన చేసింది. 
 
హెచ్‌-1బీ వీసాల జారీలో అమలులో ఉన్న కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతిని రద్దుచేయాలని ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫైచేసింది. 
 
ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందనలు తెలియచేయాలని కూడా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) కోరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ట్రంప్‌ సర్కార్‌ లాటరీ రద్దు ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడం విశేషం. 
 
కొత్త ప్రతిపాదన అంగీకారం పొందితే ఎక్కువ వేతనాలు లభించే, అధిక నైపుణ్యం గల ఉద్యోగులకే పెద్దపీట వేసేలా వీసాల జారీప్రక్రియ ఉండనుంది. తాజా నిబంధన వల్ల ప్రతిభ ఉన్నవారు మాత్రమే అమెరికాకు వచ్చే వీలుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందని, స్థానిక అమెరికన్లకు మరింత భద్రత లభిస్తుందని డీహెచ్‌ఎస్ వర్గాలు చెప్పాయి. ప్రతిఏడాది హెచ్‌1-బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా... కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65 వేల దరఖాస్తులను మాత్రమే ఎంపికచేసి వీసాలు జారీచేస్తుంటారు. 
 
దీని ద్వారా అమెరికా కంపెనీలు చౌకగా లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండడంతో స్థానికులకు అవకాశాలు దక్కడంలేదని ట్రంప్‌ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే వీసాల జారీలో భారీ సంస్కరణలు చేపడుతోంది. కాగా, హెచ్‌1-బీ, ఎల్‌-1 వీసాల జారీని డిసెంబరు 31 వరకు తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments