Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైడెన్‌పై ప్రేమ కురిపిస్తున్న అమెరికా మీడియా... ట్రంప్ గరంగరం...

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:08 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే ముందస్తు పోలింగ్ ప్రారంభమైంది. అయితే, అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు సంధిస్తున్నారు. 
 
అయితే, తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు సంబంధించిన అవినీతి వార్తలను ఇరు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నాయని డోనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఎందుకో తెలియదుగానీ... జో పై అమెరికా మీడియా తెగ ప్రేమ చూపిస్తోందంటూ సెటైర్లు వేశారు. 
 
మీడియా వాళ్లు బైడెన్‌, ఆయన ఫ్యామిలీకి వ్యతిరేకంగా వార్తలు రాయడానికి సిద్ధంగా లేరని ఆరోపించారు. బైడెన్‌పై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. మాస్కో మాజీ మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన జో బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్‌ డాలర్లు అందినట్లు ట్రంప్‌ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. 
 
అలాగే చైనా, ఉక్రెయిన్ నుంచి కూడా బైడెన్ కుటుంబానికి భారీగా నగదు అందిందని ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. బైడెన్‌ నుంచి లబ్ధి పొందిన మీడియా సంస్థలు, టెక్‌ కంపెనీలు ఆయనను రక్షించేందుకు తెగ ఆరాట పడుతున్నాయని ట్రంప్ మీడియాపై దుమ్మెత్తిపోశారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments