Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 నిమిషాల్లో చికెన్ నూడుల్స్ తినండి.. సర్‌ప్రైజ్ పొందండి..

జపాన్ రాజధాని టోక్యోలోని ఓ రెస్టారెంట్ కస్టమర్లకు వెరైటీ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే తమ రెస్టారెంట్‌లో తయారుచేసే చికెన్‌ నూడుల్స్‌ను ఎవరైతే నిర్ణీత సమయంలో తింటారో వారికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తామంటూ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (14:28 IST)
జపాన్ రాజధాని టోక్యోలోని ఓ రెస్టారెంట్ కస్టమర్లకు వెరైటీ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే తమ రెస్టారెంట్‌లో తయారుచేసే చికెన్‌ నూడుల్స్‌ను ఎవరైతే నిర్ణీత సమయంలో తింటారో వారికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తామంటూ తెలిపింది. ఈ రెస్టారెంట్ గత మూడేళ్లుగా వెరైటీ పోటీలను నిర్వహిస్తోంది.

ఈ ఏడాది టోక్యోలోని ఉమకర  రామెన్‌ హైవురి రెస్టారెంట్‌ యాజమాన్యం చికెన్ నూడుల్స్ పోటీని ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనే వారు ముందుగా 26 డాలర్లు చెల్లించాలి. ఒకవేళ పోటీలో ఓడిపోతే 88డాలర్లు పెనాల్టీ కట్టాలి. గత మూడేళ్లగా నిర్వహిస్తున్న ఈ పోటీలో ఇప్పటివరకు కేవలం 9మంది మాత్రమే విజయం సాధించారు.
 
ఇకపోతే.. ఈ పోటీలో పాల్గొనేవారు 4కిలోల చిక్కుడు మొలకలు, మసాలా, సూప్‌తో కలిపి ఫ్రై చేసిన ఒక కోడితో తయారు చేసిన చికెన్‌ నూడుల్స్‌ను నిర్ణీత సమయం(20నిమిషాల్లో)లో తినాలి. 20నిమిషాల్లో ఎవరైతే తింటారో వారు బిల్లు కట్టక్కర్లేదు. అంతేకాదు రెస్టారెంట్‌ యాజమాన్యం సదరు వ్యక్తికి బహుమతిగా 438 డాలర్లు ఇస్తుంది. అలాగే 20 నిమిషాల్లో అంత మొత్తాన్ని తినకపోతే.. అదనంగా పది నిమిషాల సమయం కూడా ఇస్తారు. అలా 30 నిమిషాల్లో మొత్తం తిన్నవారికి 236 డాలర్లు అందిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments