Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారాలను వదిలేస్తున్నా.. వైట్‍‌హౌస్‌లో ఉన్నంతకాలం ఆ పని జరగదు: ట్రంప్

వైట్‌హౌస్‌లో ఉన్నంత కాలం తన వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోనని అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తన వ్యాపారాలన్

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (14:19 IST)
వైట్‌హౌస్‌లో ఉన్నంత కాలం తన వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోనని అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తన వ్యాపారాలన్నింటినీ వదిలేలస్తానని సంచలన ప్రకటన చేసిన ట్రంప్.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లను ఎలా నిర్వహించబోతున్నారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

సీఎన్ఎన్ అనాలిసిస్ ప్రకారం ట్రంప్ మొత్తం 500 కంపెనీలను కలిగి ఉన్నారు. వాటిలో 150 కంపెనీలు టర్కీ, ఖత్తర్, సౌదీ అరేబియా వంటి కనీసం 25 విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
 
కాగా ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిదా వేసుకున్న అనంతరం.. ట్విట్టర్ ద్వారా ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తను అధ్యక్ష పదవి చేపట్టే ముందు వ్యాపారాలన్నింటిన్నీ తన కొడుకులు డాన్, ఎరిక్ లకు అప్పజెప్పుతానని ప్రకటించారు. 
 
టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలను నడిపిస్తారని ట్విట్టర్‌లో డొనాల్ట్ ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ఉన్నంతమాత్రాన వ్యాపారాలు చేయకూడదని ఎలాంటి చట్టాలు లేకపోయినప్పటికీ.. తాను మాత్రం పూర్తిస్థాయి అధ్యక్షుడిగానే ఉండేందుకు కృషి చేస్తానని వాగ్ధానం చేశారు.

కానీ బ్యాంకు రుణాలు, లీజులు వంటి డీల్స్ అవసరమయ్యే తన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆయన స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments