Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాదికోసారి స్నానం.. కాపురం చేయలేను... విడాకులు కోరిన భర్త

సాధారణంగా పంతాలు, పట్టింపులు, మనస్పర్థలు, ఆధిపత్యపోరు లేదా కట్నకానుకలు, వేధింపులు ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలు విడిపోవాలని కోరుకుంటారు.

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (16:28 IST)
సాధారణంగా పంతాలు, పట్టింపులు, మనస్పర్థలు, ఆధిపత్యపోరు లేదా కట్నకానుకలు, వేధింపులు ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలు విడిపోవాలని కోరుకుంటారు. కానీ, తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య శుభ్రతగా లేదని పేర్కొంటూ విడాకులు కోరుతున్నాడు. తన భార్య వ్యక్తిగత శుభ్రత పాటించడం లేదనీ, యేడాదికోసారి స్నానం చేస్తోందని, అందువల్ల ఆమెతో తాను కాపురం చేయలేనని మొత్తుకుంటూ విడాకులు కోరుతున్నాడు. ఇందుకోసం ఆయన ఏకంగా కోర్టునే ఆశ్రయించాడు. 
 
కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లోని అంశాలను పరిశీలిస్తే, "ప్రేమించుకునే సమయంలో నా ప్రియురాలు వారానికోసారి స్నానం చేసేది. పెళ్లయిన తర్వాత ఏడాదికోసారి మాత్రమే స్నానం చేస్తోంది. అది కూడా 6 గంటల సమయం తీసుకుంటోంది. రోజూ ఉదయం పళ్లను శుభ్రం చేసుకునే అలవాటు కూడా లేదు. ఉద్యోగం చేయొద్దంటూ పోరు పెడుతోంది. దాంతో ఉద్యోగం మానేసి మరో ప్రాంతానికి వెళ్లగా, వెతుక్కుంటూ అక్కడకు కూడా వచ్చి మరీ వేధిస్తోంది. ఆమెతో నేను కాపురం చేయలేను" అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments