Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా ఆర్డర్ చేస్తే.. ఏకంగా 5,000 డాలర్లు వచ్చాయ్...

పిజ్జా ఆర్డర్ చేస్తే... పిజ్జాకు బదులు డాలర్లు వచ్చిన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే... కాలిఫోర్నియాకు చెందిన సెలీనా అనే మహిళకు ఓరోజు చికెన్‌ పిజ్జా తినాలనిపించింది. అనుకున్నదే

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:28 IST)
పిజ్జా ఆర్డర్ చేస్తే... పిజ్జాకు బదులు డాలర్లు వచ్చిన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే... కాలిఫోర్నియాకు చెందిన సెలీనా అనే మహిళకు ఓరోజు చికెన్‌ పిజ్జా తినాలనిపించింది. అనుకున్నదే తడవుగా ''డొమినో పిజ్జా''కు ఫోను చేసి ఆర్డర్‌ చెప్పింది. కొంత సమయానికి పిజ్జా బాయ్‌ డెలివరీ చేసి వెళ్లిపోయాడు. వేడివేడిగా పిజ్జా తిందామని సెలీనా బాక్స్‌ తెరిచింది. ఆ బాక్స్‌లో పిజ్జాకు బదులుగా నోట్ల కట్టలు ఉండటం చూసి నివ్వెరపోయింది. ఆ మొత్తం విలువ 5 వేల డాలర్లు అంటే సుమారు రూ.3 లక్షల పైమాటే. అంత మొత్తంలో డబ్బును చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది. 
 
ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీ దేవిని ఇంట్లోనే ఉంచుకోవాలనిపిస్తోంది. కానీ సెలీనా అలా ఆశపడలేదు. ఎవరు.. ఎలా.. ఎందుకు పోగొట్టుకున్నారో అని ఆలోచించి.. ఆర్డరు చేసిన పిజ్జా సెంటర్‌కు ఫోను చేసి విషయమంతా చెప్పింది. ఆ డబ్బు వారిదే అని తేలడంతో సిబ్బందికి ఆ మొత్తాన్ని ఇచ్చేసింది. సెలీనా మంచితనానికి ముగ్దులైన డొమినోస్‌ సిబ్బంది... ఆమె నిజాయితీకి మెచ్చి బహుమతిగా ఏదైనా చెయ్యాలని భావించారు.  అందుకోసం సెలీనాకు ఏడాదిపాటు డొమినో పిజ్జా ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నారు.
 
ఇంతకీ పిజ్జా బాక్స్‌‌లోకి 5,000 డాలర్లు ఎలా వచ్చాయంటే.. డొమినో పిజ్జా యజమాని బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకొని పిజ్జా కేంద్రానికి వచ్చాడు. సరిగ్గా సెలీనాకు పిజ్జా పార్సెల్‌ చేస్తున్నప్పుడే పొరపాటున పిజ్జాకు బదులు డబ్బులు బాక్స్‌‌లో పెట్టేశాడు. ఈ విషయం తెలియక అలాగే డెలివరీ చేసేశారు. ఇదీ సంగతి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments