Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత వ్యాధి : 40 యేళ్లుగా నిద్రపోని మహిళ

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:49 IST)
సాధారణంగా మనిషి జీవితంలో నిద్ర అనేది ఒక భాగం. 24 గంటల్లో 12 గంటల పాటు తమతమ పనుల్లో నిమగ్నమైతే... మరో 12 గంటల్లో 8 లేదా 10 గంటల పాటు ఒక మనిషి నిద్రపోతాడు. ఒక మనిషి రోజులో కనీసం 8  లేదా 6 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. 
 
కంటినిండా నిద్ర ఉంటేనే ఉదయాన్నే లేచి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఒకరోజు లేదా రెండు రోజులు ఆరోగ్యకరమైన నిద్ర లేకపోతే అనారోగ్యం పాలు కావడం ఖాయం. అయితే మహిళా ఏకంగా 40 ఏళ్ల నుంచి అసలు నిద్ర పోవటం లేదట. ఎంత ప్రయత్నించినా ఆమె అసలు నిద్ర పట్టడం లేదట. ఈ వింత వ్యాధి మహిళ చైనాలో ఉన్నారు. 
 
చైనాకు చెందిన జ్యానింగ్ అనే మహిళ వయస్సు 45 సంవత్సరాలు. ఈమె గత 40 ఏళ్ల నుంచి నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. ఈ వింత జబ్బు కారణంగా ఆమె ఒక్క సెకను కూడా నిద్రపోలేదట. చిన్నప్పుడు తప్ప గత నలభై సంవత్సరాల నుంచి ఏనాడూ ఆ మహిళ నిద్ర పోలేదట.
 
ఆమెకు వివాహం జరిగి దాదాపు 25 సంవత్సరాలు పూర్తయింది. వివాహమైనప్పటికీ ఆమె నిద్రపోకుండా ఉంటుంది. ఈ విషయంలో ఆమె భర్త.. ఎంతో మంది వైద్యులను, ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం జరగలేదు. ఈ వింత వ్యాధి ఎవరికి చూపించినా తనకు అర్థం కావడం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆమె భర్త కూడా ఏమీ చేయలేక ఉండిపోతున్నాడు. ఇక ఇలాంటి వ్యాధి తామెప్పుడూ చూడలేదని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments