Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య..

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (16:57 IST)
12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య.. ఇదేదో విచిత్రంగా ఉంది కదూ. నిజమే.. ఉగాండాకు చెందిన ఓ వ్యక్తికి ఇలా గుర్తింపు పొందాడు. ఆ వ్యక్తి పేరు ముసా హసహ్యా కసేరా. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి. ఉగాండాలోని ముకిజా గ్రామ నివాసి. ఆయన వయసు 70 యేళ్లు. ఏకంగా 12 మందిని వివాహం చేసుకుని ఏకంగా 102 మందికి జన్మనిచ్చాడు. ఒక్కో భార్య నుంచి 8, 9 మంది పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు తన సంతానాన్ని పెంచేందుకు, వారి కడుపు నింపేందుకు నానా పాట్లు పడుతున్నాడు. అంతేకాదండోయ్.. వారి పేర్లను గుర్తు పెట్టుకునేందుకు కూడా తికమక పడుతున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ రిజిస్టర్‌నే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈయన 578 మందికి తాతగా మారాడు. 
 
1972లో ముసా తొలి వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లే. అనంతరం ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 12 మందిని చేసుకున్నాడు. అయితే, ఇంతమందిని చేసుకుంటూ పోయినా వారిని ఎలా పోషించగలనన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదని ముసా చెప్పుకొచ్చాడు. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kailash Meena (@theindotrekker)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments