చంద్రుడిపై కార్లు తిరగబోతున్నాయంటే నమ్ముతారా? కార్ల రేసు కూడా..?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (16:16 IST)
చంద్రుడిపై కార్లు తిరగబోతున్నాయంటే నమ్మితీరాల్సిందే. అక్కడ కూడా కార్ రేసులు జరుగుతాయట. ఇది నిజమే. త్వరలో చంద్రుడిపై కార్లను పంపనున్నారు. ఇందుకోసం అమెరికా హైస్కూల్‌ విద్యార్థులు రెండు కార్లను డిజైన్‌ చేయనున్నారు. ఈ కార్లను రిమోట్ కంట్రోల్ ద్వారా నడపనున్నారు. భూమిమీద నుండే రిమోట్ ద్వారా అక్కడ కార్లను నడపనున్నారు. 2021 అక్టోబర్‌లో జాబిల్లిపైనా కార్ రేస్ కూడా నిర్వహించనున్నారట.  
 
మూన్‌ మార్క్‌ మిషన్‌-1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్‌ విద్యార్థులతో కార్లను డిజైన్‌ చేయించనున్నారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ల్యాండర్‌ను వైఫైతో కనెక్ట్‌ చేయడం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో తెలిపారు.
 
ఇక చంద్రుడి పైకి పంపే కార్లు సైజు చాలా చిన్నగా ఉండనుంది. ఒకొక్క కారు బరువు 2.5 కిలోలు ఉండనుంది. ఇలా రెండు కారులను పంపనున్నారు. అలాగే చంద్రుడి పైన కార్లను దింపే వస్తువు బరువు 3 కిలోలు ఉండనుంది. ఇలా రెండు కార్లు వాటిని దించేందుకు ఉపయోగించే ఒక వస్తువు మొత్తం 8 కిలోల బరువును చంద్రుడి పైకి పంపనున్నారు. 
 
అయితే ఈ ఎనిమిది కిలోల బరువు ఖర్చు మాత్రం భారీగానే ఉంది. వీటిని అక్కడికి తీసుకెళ్లేందుకు కనీసం రూ.73 కోట్లు ఖర్చు కానుందట. ఇక ఈ కార్ రేస్ ను లైవ్‌లో ప్రసారం చేయాలని ఈ పోటీని నిర్వహిస్తున్న మూన్‌మార్క్‌ కంపెనీ భావిస్తోంది. మరి ఇది సాధ్యమా అనే విషయం తేలాలంటే..? 2021 అక్టోబర్ వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments