Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి.. మెదడు సంబంధిత వ్యాధితో..

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:22 IST)
ఆస్ట్రేలియాలో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీలో చదువుతున్న హరిశివశంకర్‌ రెడ్డి నాగారం మెదడు సంబంధిత వ్యాధితో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆయన మరణం పట్ల వర్సిటీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. 
 
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గతవారం తీవ్ర అస్వస్థతకు గురైన హరిశివశంకర్‌ను బ్రిస్బేన్‌లోని ప్రిన్సెస్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కానీ, మెదడులో రక్తస్రావం తీవ్రమవడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు.
 
యూనివర్సిటీకి చెందిన గోల్డ్‌ కోస్ట్‌ క్యాంపస్‌లో హరిశివశంకర్‌ ఐటీ స్పేషలైజేషన్‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. ఆయన ఎంతో నిబద్ధత గల విద్యార్థి అని వర్సిటీ చీఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసర్‌ మాంటీ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.
 
తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులతో విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగిస్తోంది. కావాల్సిన సాయం అందిస్తోంది. ఈ వారాంతంలోగా మృతదేహాన్ని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments