Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

సెల్వి
ఆదివారం, 1 డిశెంబరు 2024 (12:44 IST)
శనివారం అమెరికాలోని చికాగోలోని పెట్రోల్ బంక్ వెలుపల తెలంగాణకు చెందిన 22 ఏళ్ల యువకుడిని దుండగుడు కాల్చి చంపాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపు అని తెలిసింది.

ఇతను పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకుపై పడిన దుండగుడు అతని నుండి డబ్బు లాక్కోవడంతో పాటు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. బీబీఏ పూర్తి చేసిన సాయి తేజ నాలుగు నెలల క్రితం విస్కాన్సిన్‌లోని కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. 
 
గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ పంపులో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. దుండగలు దోపిడీని పూర్తి చేసి, బయలుదేరబోతున్నప్పుడు, అతను ప్రతిఘటించడానికి ప్రయత్నించకపోయినా, వారు అతనిని కాల్చి చంపారు. ఈ ఘటనపై  విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి భారత కాన్సులేట్ అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు. 
Sai Teja
 
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో వారి సహాయం కోరినట్లు తెలుస్తోంది. మృతదేహం వచ్చే వారం భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షష్టిపూర్తి సినిమా ఇప్పటి జనరేషన్ కోసమే తీసింది : రాజేంద్ర ప్రసాద్

హీరో టు దర్శకుడిగామారి మెగాస్టార్ తో విశ్వంభర చేస్తున్న వశిష్ట

అప్సరా రాణి నటించిన రాచరికం లో రక్త సంబంధాలు ఉండవు

హరి హర వీర మల్లు కోసం కలం పట్టనున్న తమిళ గీత రచయిత

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments