Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ఆరుగురు ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే జాబితా

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (19:21 IST)
ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం తమ మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుల్లో నిమగ్నమైవున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే ఆరుగురు సభ్యులతో తొలి జాబితాను శుక్రవారం తొలి జాబితాను ప్రకటించింది. 
 
ఈ ఆరుగురు జాబితాలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, న్యాయశాఖ మంత్రి వి.షణ్ముగం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీ షణ్ముగనాథన్, ఎస్. తేన్‌మొళిలకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా, మిగతా అభ్యర్థులను మరికొన్నిరోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి.
 
తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే... పళనిస్వామి- ఎడప్పాడి (సేలం జిల్లా), పన్నీర్ సెల్వం- బోధినాయకన్నూర్ (థేని జిల్లా), డి.జయకుమార్- రాయపురం, వే షణ్ముగం- విల్లుపురం, ఎస్పీ షణ్ముగనాథన్- శ్రీవైకుంఠం, ఎస్.తేన్‌మొళి- నీలక్కొట్టాయ్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments