Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత 20 యేళ్లలో పూర్తి చేసిన డిగ్రీలు చెల్లవు : తాలిబన్ పాలకులు డిక్రీ

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (22:29 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇందులోభాగంగా, గత 20 యేళ్ళ కాలంలో చేసిన డిగ్రీ, పీజీ కోర్సులు చెల్లుబాటుకావొంటూ డిక్రీని జారీచేశారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నత విద్యపై కొత్త డిక్రీని జారీ చేసింది. 
 
ఈ డిక్రీ ప్రకారం గత 20 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన విద్యార్థుల డిగ్రీలు చెల్లవు. అష్రఫ్ ఘనీ లేదా హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యలో డిగ్రీలు పొందిన విద్యార్థులను గుర్తించకూడదని ఆఫ్ఘన్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ చెప్పినట్లు సమాచారం. 
 
ఈ ప్రభుత్వాల కాలంలో మతపరమైన విద్యకు విద్యా రంగంలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. ఆఫ్ఘన్ వార్తా సంస్థ టోలో న్యూస్ ప్రకారం, కాబూల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో విద్యా మంత్రి హక్కాని సమావేశమై గత 20 యేళ్లలో విద్యారంగం గురించి చర్చించారు. 
 
మతపరమైన విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల హక్కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 2000 నుంచి 2020 వరకు అన్ని రకాల గ్రాడ్యుయేషన్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలను గుర్తించవద్దని ఆదేశించినట్లు సమాచారం. 
 
ఈ 20 ఏండ్లలో పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పీహెచ్‌డీ చేసిన వారి కంటే మదర్సాల్లో చదువుతున్న వారే ఎక్కువ గుణవంతులు, విద్యావంతులుగా ఉంటున్నారని ఆ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తున్నది.
 
నిజానికి గత 20 సంవత్సరాల్లో ఆఫ్ఘన్‌లో విద్యారంగం గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచంలోని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు కొత్త తాలిబాన్ పాలనలో మతపరమైన ప్రాతిపదికన మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండటం విచారకరమని వారంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments