Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సంక్షోభంలో ఆప్ఘనిస్థాన్.. ఉచితంగా గోధుమల పంపిణీ

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (21:33 IST)
ఆప్ఘనిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో చనిపోవడం దీన పరిస్థితులకు గుర్తు చేస్తోంది. దీంతో ఆప్ఘన్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆకలి చావులను నిరోధించేందుకు గాను ‘పనికి గోధుమల పంపిణీ’ని ప్రారంభించింది. అంటే పని చేసిన వారికి వేతనం బదులుగా గోధుమలను పంపిణీ చేయనుంది.
 
ఈ మేరకు అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ అధికారికంగా గోధుమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అఫ్గాన్‌ వ్యవసాయ మంత్రి అబ్దుల్‌ రెహ్మాన్‌ రషీద్‌, కాబూల్‌ మేయర్‌ హమ్‌దుల్లా నొమాని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కాబూల్‌లోనే కాకుండా హెరాత్‌, జలాలాబాద్‌, కాందహార్‌, మజారే షరీఫ్‌ తదితర నగరాలు, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తాలిబన్లు తెలిపారు. అదేవిధంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు విస్తృతంగా కాలువల నిర్మాణం చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments