Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు వర్శిటీ విద్యపై నిషేధం విధించిన తాలిబన్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (12:22 IST)
ఆప్ఘనిస్థాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలపై తాలిబన్ యంత్రాంగం ఆంక్షలు విధిస్తూనే వుంది. మహిళల హక్కులను అణచివేస్తోంది. 
 
అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నా.. తాలిబన్లు మాత్రం పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా దేశంలోని మహిళలకు వర్శిటీ విద్యపై నిషేధం విధించారు. బాలికలు, మహిళలు ఇక యూనివర్శిటీల్లో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించింది. 
 
మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయండని... తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉత్తర్వులు అమలు చేయండని ఆప్ఘనిస్థాన్‍లోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ లేఖరాశారు. ఈ లెటర్‌ను ఆ శాఖ ప్రతినిధి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.
 
మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించిన తాలిబన్‍ల నిర్ణయాన్ని చాలా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ ఇప్పటికే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments