ఏపీలోని వైద్య విద్యార్థుల డ్రెస్ కోడ్‌పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకషన్ (డీఎంఈ) స్పష్టం చేసింది.
ఏపీలోని వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు ధరించకూడదని.. సంప్రదాయ దుస్తులు ధరించి రావాలంటూ డీఎంఈ ఆదేశించినట్టుగా వచ్చిన వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో.. అమ్మాయిలతో చీర, చుడిదార్‌తో రావాలని, జుట్టును వదులుగా వదిలేయొద్దని పురుషులైతే క్లీన్ షేవ్‌తో రావాలంటూ డీఎంఈ ఆదేశించినట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలను నమ్మవద్దని.. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. విధుల్లో వున్న సమయంలో ఆరోగ్య శాఖ ఉద్యోగులు, వైద్యుల మార్గద్శకాలు విడుదల చేస్తామని.. డాక్ట్ వినోద్ కుమార్ వివరించారు. ే