Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-12-2022 శనివారం దినఫలాలు - వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం

Advertiesment
astrolgy
, శనివారం, 3 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. బంధువుల రాకతో పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. చిన్న విషయమే సమస్యగా మారే ఆస్కారంఉంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉండగలదు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
వృషభం :- ఆలయ సందర్శనాలలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. పై అధికారుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 
 
మిథునం :- ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. మీ శ్రీమతి సలహా ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. కానుకలిచ్చే విషయంలో దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. 
 
కర్కాటకం :- తొందరపాటు నిర్ణయాల వల్ల ధననష్టం, వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో శిక్షణావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయాల్లో మెలకువ, ఏకాగ్రత చాలా అవసరం.
 
సింహం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. కళ, క్రీడ, టెక్నికల్ రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధు మిత్రులను కలుసుకుంటారు. కొంత మొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
తుల :- పాత మిత్రుల కలయితో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ధనం అధికంగా వ్యయం చేస్తారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. విద్యార్థులకు ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
వృశ్చికం :- ఇంటా, బయట ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. షాపు గుమాస్తాలతో సమస్యలు ఎదురవుతాయి. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. ఒక స్థిరాస్తి విక్రయాన్ని పునరాలోచించండి. ఉద్యోగస్తులు అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ, ఉపాధిశిక్షణ సమాచారం అందుతుంది.
 
ధనస్సు :- సోదరుల మధ్య అభిప్రాయబేధాలు తొలగి పోతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. శత్రువులు మిత్రులుగామారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు.
 
మకరం :- సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. అధికారులు ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం.
 
కుంభం :- విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. కాళ్ళు, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
మీనం :- స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచీ మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. చేపట్టిన పనులువిసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-12-2022 శుక్రవారం దినఫలాలు - కామేశ్వరి దేవిని పూజిస్తే...