Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

01-12-2022 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించిన (video)

Weekly astrology
, గురువారం, 1 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- అధిక ధనవ్యయం, ముఖ్యమైన పనులతో సతమతమవుతారు. అనుక్షణం ఒత్తిడి, హడావుడికి లోనవుతారు. విద్యార్ధులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వృత్తిపరంగా పురోభివృద్ధి సాధిస్తారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తరుచూ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభం :- ఆకస్మికంగా ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ వహించినా జయం పొందుతారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు ఆకస్మిక ప్రయాణం, ధనప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. 
 
మిథునం :- విందు, వినోదాలలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వాహన యోగం, పుణ్యక్షేత్ర సందర్శన శుభ ఫలితాన్నిస్తుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. శుభకార్యక్రమాలల్లో బంధువుల ఆదరణ సంతోషం కలిగిస్తుంది. 
 
 

కర్కాటకం:- స్త్రీలకు ధనప్రాప్తి, వస్తులాభం, పుణ్యక్షేత్ర సందర్శన వంటి ఫలితాలున్నాయి. బంధుమిత్రుల నిందలు, నిష్టూరాలు తప్పవు. ఉద్యోగ, విదేశీయాన యత్నాల్లో చికాకులు, ఆటుపోట్లు తప్పవు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగడం మంచిది. అధిక ధనవ్యయం అయినప్పటికీ సంతృప్తి, ప్రయోజనంఉంటాయి. 
 
సింహం :- ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. అవగాహన లేని వ్యాపారాలు, పనులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. అన్ని రంగాలవారికి యోగప్రదమే. ప్రయాణాల్లో మెళకువ అవసరం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.
 
కన్య :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. వృత్తిపరంగా చికాకులు లేకున్నా ఆదాయ సంతృప్తి అంతగా ఉండదు. క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ కళత్ర ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది.
 
తుల :- గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. భాగస్వామికులు, అయన వారు మిమ్ములను తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ స్థానచలనానికి ఆస్కారం ఉంది. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. చెక్కులు, హామీల విషయంలో జాగ్రత్త అవసరం.
 
వృశ్చికం :- దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. విద్యార్థులు ధ్యేయసాధనకు మరింత శ్రమించాలి. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. మీ సంతానం ఇష్టాలకు అడ్డుచెప్పటం మంచిది కాదు.
 
ధనస్సు :- మీ సంతానం ఇష్టాలకు అడ్డుచెప్పటం మంచిది కాదు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్థులు ధ్యేయసాధనకు మరింత శ్రమించాలి. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. భాగస్వామికంగా కంటే సొంత వ్యాపారాలకే ప్రాధాన్యం ఇవ్వండి.
 
మకరం :- ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. నిర్మాణ పనుల్లో బిల్డర్లు, పనివారలతో చికాకులు తప్పవు. నిరుద్యోగులు, వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెడు స్నేహాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
కుంభం :- దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. పొదుపు పథకాలు, నూతన వ్యాపారాల దిశగా మీ ఆలోచనలుంటాయి. గృహ నిర్మాణాల ప్లానుకు ఆమోదం, రుణాలు లభిస్తాయి. మీ సంతానం విద్య, వివాహ, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
మీనం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ నిజాయితీ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామికంగా కంటే సొంత వ్యాపారాలకే ప్రాధాన్యం ఇవ్వండి. స్థిరచరాస్తుల మూలక ధనం అందుకుంటారు. ఆరంభంలో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు తలెత్తినా ద్వితీయార్థం సర్దుకుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 2022 మాస ఫలితాలు.. ఈ రాశుల వారికి యోగం..