Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియా బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

సిరియా దేశంలో చెలరేగిన అంతర్యుద్ధంలో పలువురు చిన్నారులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గత సంవత్సరంలో సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో ఒమ్రన్ అనే చిన్నారి గాయపడ్డాడు.

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (14:16 IST)
సిరియా దేశంలో చెలరేగిన అంతర్యుద్ధంలో పలువురు చిన్నారులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గత సంవత్సరంలో సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో ఒమ్రన్ అనే చిన్నారి గాయపడ్డాడు. కంటి మీద నుంచి రక్తం కారుతున్నా ఏం జరిగిందో తెలుసుకోలేని ఒమ్రన్ డక్‌నీశ్ అమాయకత్వం ప్రపంచ హింసాత్మక థోరణిని ప్రశ్నించింది. సిగ్గుతో తల వంచుకునేలా చేసింది.
 
ఈ ఒక్క ఫోటో సిరియాలో జరిగిన దమన కాండను కళ్లకు కట్టింది కూడా. ఆ ఒక్క దృశ్యం కోట్ల మందిని కదిలించింది. సిరియాలో ఎంత మారణకాండ జరిగిందో ఈ ఒక్క ఫోటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంబులెన్స్ వెనుక భాగంలో రక్తపు మరకలతో నిండిన ముఖంతో, దుమ్ముధూళి కొట్టుకున్న శరీరంతో ఆ చిన్నారి ఉన్న పరిస్థితిని చూసి కరగని గుండె లేదు. వైరల్ అయిన చిన్నారి ఫోటో గుర్తుండే ఉంటుంది. 
 
ఆ ప్రమాదంలోనే ఒమ్రన్ అన్నయ్య అలీ చనిపోయాడు. ఆ హింసాత్మక ఘటన జరిగి ఇప్పటికి దాదాపు ఏడాది కావస్తోంది. ఆ చిన్నారి షాక్ నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు ఎంతో ఆరోగ్యవంతంగా, చూడముచ్చటగా ఉన్నాడు. ఆ బాలుడి తండ్రిని ఓ మహిళా జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫేస్‌బుక్‌లో ఒమ్రన్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఒమ్రన్ ఎంతో ముద్దుగా కనిపిస్తున్నాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments