Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ ఒక్కసారి నొక్కినందుకు నెలకు రూ.1.62 లక్షల జీతం

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (18:31 IST)
టార్గెట్లు, ఓవర్ టైమ్‌లు పేరిట విపరీతమైన పనులు చేయించుకునే సంస్థలున్న ఈ రోజుల్లో.. ఓ సంస్థ ఏ పని చేయని ఉద్యోగికి నెలకు రూ.1.62 లక్షల జీతం ఇచ్చేందుకు సిద్ధమైంది. వినడానికి వింతగానే ఉన్నా.. ఇది నిజం. ఈ ఉద్యోగికి కేవలం జీతం మాత్రమే కాదు, సెలవులు, ఇతర ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 
 
స్వీడెన్‌లో గోథెన్బర్గ్ నగరంలో ఓ ఎక్స్‌పరిమెంటల్ ఆర్ట్ ప్రాజెక్ట్‌ సంస్థ ఓ రైల్వే స్టేషన్‌ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం నిధులు సమకూర్చుతూండగా.. ఈ రైల్వే స్టేషన్లో పనిచేసేందుకు ఆ సంస్థ ఓ ఉద్యోగిని నియమించాలని నిర్ణయించింది. అయితే, ఆ ఉద్యోగి అక్కడ ఏ పనీ చేయనక్కర్లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారిలో ఒకరిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 
 
ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే వ్యక్తి రైల్వే స్టేషన్‌లో పనిచేయాలి. రోజు మొత్తంలో అతను చేయాల్సిన ఒకే ఒక్క పని.. ఆ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఓ గడియారం బటన్ నొక్కడం. ఆ బటన్ నొక్కిన వెంటనే స్టేషన్‌లో ఉండే ఫ్లోరోసెంట్ బల్బులన్నీ వెలుగుతాయి. పనివేళలు ముగిసిన తర్వాత మళ్లీ ఆ బటన్ నొక్కి, బల్బులు ఆపేయడం. 
 
అంతే ఆ రోజుకు అతని డ్యూటీ పూర్తవుతుంది. అతను గడియారం బటన్ నొక్కిన తర్వాత ఎక్కడికైనా తిరిగి రావచ్చు. బోరు కొడితే ఆ ఉద్యోగం వదిలి మరెవ్వరినైనా నియమించుకునే స్వేచ్ఛ కూడా అతనికి ఉంటుంది లేదా పదవీ విరమణ వయస్సు వరకు అదే ఉద్యోగంలో కొనసాగవచ్చు. పదవీ విరమణ తర్వాత అతనికి పింఛన్ కూడా లభిస్తుంది. 
 
కాగా... ఈ పని లేని ఉద్యోగం ఐడియా 2017లో శ్రీకారం చుట్టబడింది. స్వీడెన్‌కు చెందిన పబ్లిక్ ఆర్ట్ ఏజెన్సీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్పట్లో ఓ పోటీ నిర్వహించింది. గోథెన్బర్గ్ రైల్వే స్టేషన్‌‌కు ప్రత్యేకంగా నిలిచిపోయే గొప్ప ఐడియా ఇవ్వాలని ప్రపంచంలోని ఆర్టిస్టులందరికీ పిలుపునివ్వగా... విజేతలకు 750,000 డాలర్లు ( భారతదేశ కరెన్సీలో రూ.5,22,75,000) బహుమతి కూడా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా సిమోన్ గోల్డెన్ అండ్ జాకబ్ సెనైబీ అనే సంస్థ ఈ పనిలేని ఉద్యోగం ఐడియా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఐడియాను అమలు పరిచేందుకు నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు. అయితే, దీనిపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టును ప్రజాధనంతో చేపడుతున్నారని మర్చిపోయి ఏ పనీ చేయని ఉద్యోగికి భారీ మొత్తాన్ని జీతంగా ఇవ్వడమంటే నిధులను దుర్వినియోగం చేసినట్లేనని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments